breaking news
tirumanjanam
-
25న తిరుమల ఆలయంలో గోకులాష్టమి
– శ్రీవారి దర్శనానికి 8 గంటలు సాక్షి,తిరుమల: తిరుమలలో ఈ నెల 25వ తేదీన గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. రాత్రి 8 నుండి 10 గంటల వరకు బంగారు వాకిలిలో ఆస్థానం, శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పకు ఏకాంతంగా తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం 26వ తేదీ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప సాక్షిగా ఆలయ పురవీ«ధుల్లో ఉట్లోత్సవం నిర్వహిస్తారు. అదేరోజు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార ఆర్జిత సేవలు రద్దుచేశారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రం 6 గంటల వరకు 45,854 మంది శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి 17 కంపార్ట్మెంట్లలోని సర్వదర్శనం భక్తులకు 8 గంటలు, 8 కంపార్ట్మెంట్లలోని కాలిబాట భక్తులకు 6 గంటలు సమయం తర్వాత స్వామి దర్శనం లభిస్తోంది. గదులు ఖాళీ లేవు. -
భక్తాగ్రేసరుడిపై శ్రీరామచంద్రుడి విహారం
సాక్షి,తిరుమల: శ్రీరామనవమిని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి 7గంటల నుండి 8.30 గంటల వరకు మలయప్పస్వామి శ్రీరామచంద్రుని రూపంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయంలోని బంగారు వాకిలిలో రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు ప్రత్యేకంగా ఆస్థాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయుడు వేర్వేరుగా ఆశీనులై ఆస్థానపూజలందుకున్నారు. అంతకుముందు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఆలయంలోని రంగనాయక మండపంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. శనివారం రాత్రి 8 గంటలకు ఆలయంలో శ్రీరామపట్టాభిషేకం నిర్వహించనున్నారు.