భక్తాగ్రేసరుడిపై శ్రీరామచంద్రుడి విహారం | sriramanavami and tirumanjanam at tirumala | Sakshi
Sakshi News home page

భక్తాగ్రేసరుడిపై శ్రీరామచంద్రుడి విహారం

Apr 16 2016 4:47 AM | Updated on Sep 3 2017 10:00 PM

భక్తాగ్రేసరుడిపై శ్రీరామచంద్రుడి విహారం

భక్తాగ్రేసరుడిపై శ్రీరామచంద్రుడి విహారం

శ్రీరామనవమిని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి 7గంటల నుండి 8.30 గంటల వరకు మలయప్పస్వామి శ్రీరామచంద్రుని రూపంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

సాక్షి,తిరుమల: శ్రీరామనవమిని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి 7గంటల నుండి 8.30 గంటల వరకు మలయప్పస్వామి శ్రీరామచంద్రుని రూపంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయంలోని బంగారు వాకిలిలో రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు ప్రత్యేకంగా ఆస్థాన కార్యక్రమాన్ని  నిర్వహించారు.

సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయుడు వేర్వేరుగా ఆశీనులై ఆస్థానపూజలందుకున్నారు. అంతకుముందు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఆలయంలోని రంగనాయక మండపంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.  శనివారం రాత్రి 8 గంటలకు ఆలయంలో శ్రీరామపట్టాభిషేకం నిర్వహించనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement