కందులకు గిట్టుబాటు ధర కల్పించాలి | Give lentils Fair and Remunerative Price | Sakshi
Sakshi News home page

కందులకు గిట్టుబాటు ధర కల్పించాలి

Feb 4 2017 10:06 PM | Updated on Oct 9 2018 2:17 PM

కందులకు గిట్టుబాటు ధర కల్పించాలి - Sakshi

కందులకు గిట్టుబాటు ధర కల్పించాలి

కందులకు రూ. 10వేలు గిట్టుబాటు ధర కల్పించాలని దళిత బహుజన వామపక్షాల ఐక్య వేదిక నాయకులు డిమాండ్‌ చేశారు.

నిర్మల్‌టౌన్  : కందులకు రూ. 10వేలు గిట్టుబాటు ధర కల్పించాలని దళిత బహుజన వామపక్షాల ఐక్య వేదిక నాయకులు డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం వారు పరిశీలించారు. ఈ సీజన్ లో  రైతులు ఎక్కువగా కంది పంటను వేశారని తెలిపారు. గత ఏడాది కందులకు రూ. 8500 నుంచి రూ. 12వేల వరకు మద్ధతు ధరతో మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేశారని గుర్తుచేశారు.

కాగా ఈ యేడాది  కేవలం రూ.5050 మద్దతు ధరను కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 3,667 క్వింటాళ్ల కందుల కొనుగోలు చేశారని తెలిపారు. మద్ధతు ధర పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశీలనలో నాయకులు కిషన్ కుమార్, జగన్ మోహన్, ఎస్‌ఎన్ రెడ్డి, శంకర్, రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement