టెంపోవ్యా¯ŒSలో గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు అర్బ¯ŒS జిల్లా తూర్పు మండలం డీఎస్పీ రమేష్‌బాబు తెలిపారు. బొమ్మూరు పోలీస్‌స్టేçÙ¯ŒSలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజమహేంద్రవరం అర్బ¯ŒS
గంజాయి తరలింపు కేసులో నలుగురి అరెస్టు
Jan 18 2017 10:24 PM | Updated on Aug 20 2018 4:44 PM
రాజమహేంద్రవరం రూరల్ :
టెంపోవ్యా¯ŒSలో గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు అర్బ¯ŒS జిల్లా తూర్పు మండలం డీఎస్పీ రమేష్‌బాబు తెలిపారు. బొమ్మూరు పోలీస్‌స్టేçÙ¯ŒSలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజమహేంద్రవరం అర్బ¯ŒS ఎస్పీ బి.రాజకుమారికి అందిన సమాచారంపై, తన ఆదేశాల మేరకు బొమ్మూరు సీఐ కనకారావు, ఎస్‌ఐలు కిషోర్‌కుమార్, నాగబాబు, సిబ్బందితో కలసి హుకుంపేట జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేశారని చెప్పారు. టెంపో వ్యా¯ŒSను తనిఖీ చేస్తుండగా పది బస్తాలలో ఉంచిన 277 కిలోల గంజాయి బయటపడిందన్నారు. దీంతో వ్యా¯ŒS డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. వారి నుంచి 277 కిలోల గంజాయి, ఐదు సెల్‌ఫోన్లు, రూ.12,730 నగదు, వ్యా¯ŒS స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. నిందితులైన రాజవోలు గాయత్రినగర్‌కు చెందిన గొలుగూరి వెంకట కృష్ణారెడ్డి, గంగవరం మండలం నెల్లిపూడికి చెందిన చింతల రాంబాబు, రావులపాలెంకు చెందిన పడాల చంద్రశేఖరరెడ్డి, రావులపాలెం మండలం బొక్కావారిపాలెంకు చెందిన కోనా వెంకటేశ్వరరావులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నామని డీఎస్పీ తెలిపారు. బొమ్మూరు సీఐ కనకారావు, సిబ్బందిని ఆయన అభినందించారు.
Advertisement
Advertisement