యువకుడిపై మూకుమ్మడి దాడి | gang attack younger in bonthalapalli | Sakshi
Sakshi News home page

యువకుడిపై మూకుమ్మడి దాడి

Oct 14 2016 10:53 PM | Updated on Sep 4 2017 5:12 PM

పుట్తపర్తి మండలం బొంతలపల్లికి చెందిన చెన్నకేశవులు అనే యువకుడిపై అదే గ్రామానికి చెందిన నాగేశ్, అతని సోదరులు కేశవ, రామచంద్ర గురువారం రాత్రి విచక్షణారహితంగా దాడి చేసి కొట్టారని రూరల్‌ ఎస్‌ఐ రాఘవరెడ్డి శుక్రవారం తెలిపారు.

పుట్టపర్తి అర్బన్‌ : పుట్తపర్తి మండలం బొంతలపల్లికి చెందిన చెన్నకేశవులు అనే యువకుడిపై అదే గ్రామానికి చెందిన నాగేశ్, అతని సోదరులు కేశవ, రామచంద్ర గురువారం రాత్రి విచక్షణారహితంగా దాడి చేసి కొట్టారని రూరల్‌ ఎస్‌ఐ రాఘవరెడ్డి శుక్రవారం తెలిపారు. తన భార్యతో చెన్నకేశవులు సన్నిహితంగా ఉంటున్నాడనే అనుమానంతో నాగేశ్‌ తన సోదరులతో కలసి దాడి చేసినట్లు వివరించారు. ఈ విషయమై గతంలో పెద్ద మనుషుల సక్షమంలో పంచాయితీ సైతం జరిగిందన్నారు.

అయినా అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కుడి చెయ్యి, కుడి కాలు విరిగేలా రాళ్లతో కొట్టారన్నారు.దెబ్బలకు అతను స్పహతప్పి పడిపోగా, వెంటనే కర్నూలు పెద్దాస్పత్రికి తరలించినట్లు వివరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement