కొవ్వూరు: గోదావరికి ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టింది. దీంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 28,766 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు.
పశ్చిమ డెల్టాకు 7,300 క్యూసెక్కులు
Aug 27 2016 8:28 PM | Updated on Sep 4 2017 11:10 AM
కొవ్వూరు: గోదావరికి ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టింది. దీంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 28,766 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 14,500 క్యూసెక్కుల నీటì ని వదులుతున్నారు. తూర్పు డెల్టాకు 4,600, సెంట్రల్ డెల్టాకి 2,600, పశ్చిమ డెల్టాకు 7,300 క్యూసెక్కుల నీటిని యథావిధిగా విడుదల చేస్తున్నారు. జిల్లాలోని ఏలూరు కాలువకు 1,260, ఉండి కాలువకు 1,785, నరసాపురం కాలువకు 2,093, జీ అండ్ వీ కాలువకు 898, అత్తిలి కాలువకు 792 క్యూసెక్కుల నీరు చొప్పున వదులుతున్నారు.
Advertisement
Advertisement