వేటు..మారేట్టు..! | eo constration on temple issues | Sakshi
Sakshi News home page

వేటు..మారేట్టు..!

Sep 15 2016 11:39 PM | Updated on Mar 19 2019 6:15 PM

వేటు..మారేట్టు..! - Sakshi

వేటు..మారేట్టు..!

సీతమ్మ, లక్షణ స్వామి నగలు మాయం..భక్తుల కానుకల జమా పుస్తకం అదృశ్యం..ఇష్టమొచ్చినట్లు కొందరి వ్యవహారం..ఇలా వరుస ఘటనలతో భద్రాద్రి శ్ర శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో పాలనను గాడిలో పెట్టేందుకు ఈఓ రమేష్‌బాబు ప్రత్యేక దృష్టి సారించారు.

భద్రాచలం: సీతమ్మ, లక్షణ స్వామి నగలు మాయం..భక్తుల కానుకల జమా పుస్తకం అదృశ్యం..ఇష్టమొచ్చినట్లు కొందరి వ్యవహారం..ఇలా వరుస ఘటనలతో భద్రాద్రి శ్ర శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో పాలనను గాడిలో పెట్టేందుకు ఈఓ రమేష్‌బాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా దేవస్థానం ఏఈఓ శ్రావణ్‌ కుమార్‌తో సహా ఉద్యోగులందరినీ ప్రస్తుతం ఉన్న చోట నుంచి మరో విభాగానికి బదిలీ లేదంటే సర్దుబాటు చేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు. అర్చకులు కూడా ఇక నుంచి రొటేష¯ŒS పద్ధతిలో విధులు నిర్వర్తించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే 45 మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు స్థానభ్రంశం కల్పించిన ఈఓ తాజాగా రెగ్యులర్‌ ఉద్యోగులపై కొరడా ఝుళిపించారు. పనితీరు ఆధారంగా కొత్తగా విధులు, బాధ్యతలు కేటాయించారు. రామచంద్రమోహన్, చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఈఓలుగా పనిచేసిన కాలంలో పాలనపై వారికి కొంతమేర పట్టు ఉండేది. వారి తర్వాత ప్రస్తుత ఈఓ రమేష్‌బాబు తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ హోదాలో ఉన్న రమేష్‌బాబు, ఇక్కడ తన విచక్షణాధికారాలను ఉపయోగించి, ఉద్యోగులు, అర్చకులకు స్థానభ్రంశం కల్పించేందుకు నిర్ణయించారు. ఇటీవల జరిగిన పరిణామాలతో ఆలయ ప్రతిష్టకు తీవ్ర భంగం వాటిల్లగా, ఆ మరకలు తొలగించే దిశగా  భవిష్యత్‌లోనూ చర్యలు ఉంటాయనే సంకేతాలు ఇచ్చారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement