తూర్పుగోదావరి జిల్లాలో కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద ఉద్రిక్త వాతావారణం చోటుచేసుకుంది. శనివారం ఆయన ఇంటికి వచ్చిన వైద్యబృందంతో వైద్య పరీక్షలకు ముద్రగడ నిరాకరిస్తూ తలుపులు వేసుకున్నట్టు తెలిసింది. ఇప్పటికే రెండు సార్లు వైద్యపరీక్షలకు ఆయన నిరాకరించారు.
అయితే మరోసారి వైద్యపరీక్షలు నిర్వహించేందుకు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో వైద్యబృందం ముద్రగడ ఇంటికి వెళ్లగా తలుపులు మూసివేసినట్టు వైద్యులు తెలిపారు. దాంతో ఆయన ఇంటివద్దే వైద్యులు నిరీక్షిస్తున్నామని చెప్పారు. రంగంలోకి దిగిన పోలీసులు ముద్రగడ ఇంటి తలుపులను బలవంతంగా తెరిచేందుకు యత్నించి విఫలమైయ్యారు. గదిలో ఉండి ఎంతకీ తలుపులు తీయక పోవడంతో వైద్యబృందం వెనుదిరిగినట్టు సమాచారం.