అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు మృతి చెం దిన సంఘటన మండలంలోని ఎలుకుర్తి హవేలి గ్రామంలో ఆది వారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎలుకుర్తిహవేలి గ్రామానికి చెందిన బొల్లం సాంబలక్ష్మి (70), మల్ల య్య దంపతులకు ఇద్దరు కుమారులు కుమారస్వామి, రవీందర్ ఉన్నారు.
అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి
Sep 12 2016 12:14 AM | Updated on Sep 28 2018 3:41 PM
గీసుకొండ : అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు మృతి చెం దిన సంఘటన మండలంలోని ఎలుకుర్తి హవేలి గ్రామంలో ఆది వారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎలుకుర్తిహవేలి గ్రామానికి చెందిన బొల్లం సాంబలక్ష్మి (70), మల్ల య్య దంపతులకు ఇద్దరు కుమారులు కుమారస్వామి, రవీందర్ ఉన్నారు.
ఇం దులో చిన్న కుమారుడు రవీందర్ పోలీస్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తూ హన్మకొండలో నివాసముంటున్నారు. కాగా, మల్లయ్య తన భార్య తో కొద్ది రోజులుగా గొడవపడుతున్నాడు. ఈ క్రమంలో చిన్న కుమారుడు రవీందర్ తల్లిని హన్మకొండలోని తన నివాసానికి ఇటీవల తీసుకుని వెళ్లాడు. అయితే సాంబలక్ష్మిని తన వద్దకు పంపించాలని తండ్రి మల్లయ్య గొడవ చేస్తుండడంతో రవీందర్ పది రోజుల క్రితం ఆమెను ఎలుకుర్తిహవేలి గ్రామానికి పంపించారు. ఈ క్రమంలో ఇంటికి చేరిన సాంబ లక్ష్మిని.. మల్లయ్య, అత డి పెద్ద కుమారుడు కలిసి చం పారని చిన్న కుమారుడు రవీందర్ ఫిర్యాదు చేసినట్లు పో లీసులు తెలిపారు. కాగా, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గీసుకొండ సీఐ శ్రీనివాస్ తెలిపారు.
Advertisement
Advertisement