అత్తమామల నుంచి వారసత్వంగా దక్కాల్సిన భూమి ని తమ రక్తసంబంధీకులే కబ్జా చేశారని పెద్దపప్పూరు మండలం గార్లదిన్నె గ్రా మానికి చెందిన తిప్పిరెడ్డిగారి నాగమ్మ(80) ఆవేదన వ్యక్తం చేసింది
భూమి కోసం 30 ఏళ్లుగా పోరాటం
అనంతపురం సెంట్రల్ : అత్తమామల నుంచి వారసత్వంగా దక్కాల్సిన భూమి ని తమ రక్తసంబంధీకులే కబ్జా చేశారని పెద్దపప్పూరు మండలం గార్లదిన్నె గ్రా మానికి చెందిన తిప్పిరెడ్డిగారి నాగమ్మ(80) ఆవేదన వ్యక్తం చేసింది. జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబుకు ఫిర్యాదు చేసేం దుకు సోమవారం ఎస్పీ క్యాంపు ఆఫీసుకు వచ్చిన ఆమె, తన సమస్యను ఆల కించేందుకు ఎవరూ లేకపోవడంతో నిరాశగా వెనుతిరిగారు. సాక్షి ఆమెను కదిలించిగా తన గోడు ఇలా వెళ్లబోసుకుంది. ‘నా అత్తమామలకు చెందిన 70 ఎకరాల్లో 35 ఎకరాలు నా వాటాగా రా వాల్సి ఉంది. అప్పట్లో నా ప్రమేయం లేకుండా ఇతరులకు అమ్మినట్లుగా రికార్డులు తయారు చేశారు. వీటితో పాటు కర్నూలు నగరంలో రూ.కోట్లు విలువ జేసే ఆస్తులు ఉన్నాయి. ఏవీ నాకు దక్కనీయకుండా మా రక్తసంబంధీకులే ఆక్రమించుకున్నారు. ఇంట్లో నడవలేని కుమారుడు ఉన్నాడు. ఇలాంటి సమయంలో మాకు పూట గడవడమే కష్టంగా ఉంది. కోట్ల ఆస్తులు ఉన్నా మాకు దక్కనీయకుండా చేస్తున్నారు. 30 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం కాలేదు. మా సమస్య ఎవరితో చెప్పుకుంటే న్యాయం జరుగుతుందో కూడా తెలియడం లేదు’ అని కన్నీటి పర్యంతమయ్యారు.