జిల్లా స్థాయి పోటీలు ప్రారంభం | District level sports begin | Sakshi
Sakshi News home page

జిల్లా స్థాయి పోటీలు ప్రారంభం

Aug 28 2016 9:31 PM | Updated on Sep 4 2017 11:19 AM

జిల్లా స్థాయి పోటీలు ప్రారంభం

జిల్లా స్థాయి పోటీలు ప్రారంభం

హాకీ మంత్రికుడు మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతి, జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కారించుకుని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం బాలబాలికలకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్, స్కేటింగ్, టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు నిర్వహించారు.

గుంటూరు స్పోర్ట్స్‌: హాకీ మంత్రికుడు మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతి, జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కారించుకుని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం బాలబాలికలకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్, స్కేటింగ్, టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు నిర్వహించారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాసరావు క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. డీఎస్‌డీవో శ్రీనివాసరావు మాట్లాడుతూ 27వ తేదీన హాకీ, జిమ్నాస్టిక్‌ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు సోమవారం జరిగే కార్యక్రమంలో బహుమతులు ఇవ్వనున్నట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement