24న జిల్లాస్థాయి జాతీయ సైన్స్‌ సెమినార్‌ | Sakshi
Sakshi News home page

24న జిల్లాస్థాయి జాతీయ సైన్స్‌ సెమినార్‌

Published Thu, Aug 4 2016 12:07 AM

district level national scince seminar on 24

విద్యారణ్యపురి : రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (ఎస్‌సీఈఆర్‌టీ) ఆదేశానుసారం సుస్థి ర ఆహార భద్రతలో పప్పు ధాన్యాలు – అవకాశాలు సవాళ్లు అనే అంశంపై జిల్లా స్థాయి జాతీయ సైన్స్‌ సెమినార్‌ను ఈనెల 24న హన్మకొండ డైట్‌ కళాశాలలో నిర్వహించనున్నట్లు డీఈఓ పి. రాజీవ్‌ తెలిపారు. ఈ సెమినార్‌లో పాల్గొనేందుకు 8, 9, 10 తరగతుల విద్యార్థులే అర్హులన్నారు. పాఠశాల స్థాయిలో ఈసైన్స్‌ సెమినార్‌ను ఈనెల 11 లోగా,  డివి జన్‌ స్థాయిలో ఈనెల 18 లోగా నిర్వహించుకోవాలన్నారు. పాఠశాల స్థాయిలో హెచ్‌ఎం లు, ప్రిన్సిపాల్స్, డివిజన్‌ స్థాయిలో డిప్యూటీ ఈఓల ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉంటుం దన్నారు. పాఠశాల స్థాయిలో ప్రథమ బహుమతి సాధించిన వారు డివిజన్‌ స్థాయికి అర్హులని, డివిజన్‌ స్థాయిలో మొదటి ఐదు స్థానా ల్లో నిలిచిన వారు జిల్లాస్థాయికి అర్హులని వివరించారు. జిల్లాస్థాయి సె మినార్‌లో మొదటి, రెండు స్థానాలు లభించి న విద్యార్థులను ఈనెల 30న నిర్వహించే రాష్ట్ర స్థాయి జాతీయ సెమినార్‌కు పంపిస్తామని,  ఒక్కో విద్యార్థి ఆరు నిమిషాలు మాట్లాడాలని, నిపుణులు ప్రశ్నలు అడుగుతారని తెలిపారు.  

Advertisement
Advertisement