బాలకార్మికులను అదుపులోకి తీసుకున్న అధికారులు | detained child labour | Sakshi
Sakshi News home page

బాలకార్మికులను అదుపులోకి తీసుకున్న అధికారులు

Jul 27 2016 11:25 PM | Updated on Sep 4 2017 6:35 AM

ఆపరేషన్‌ ముస్కాన్‌లో భాగంగా బాలల సంరక్షణ అధికారులు బుధవారం రామాయంపేట పట్టణంలో తొమ్మిది మంది బాలకార్మికులను గుర్తించి పట్టుకున్నారు.

రామాయంపేట : ఆపరేషన్‌ ముస్కాన్‌లో భాగంగా బాలల సంరక్షణ అధికారులు బుధవారం రామాయంపేట పట్టణంలో తొమ్మిది మంది బాలకార్మికులను గుర్తించి పట్టుకున్నారు. బాలల సంరక్షణ జిల్లా అధికారి భాస్కర్‌రావు ఆధ్వర్యంలో షీం టీం హెడ్‌ కానిస్టేబుల్‌ రాజు, కానిస్టేబుళ్లు మధు, సోమలత పట్టణంలోని పలు దుకాణాలు, మెకానిక్‌ షెడ్డులు, కిరాణా దుకాణాల్లో పనిచేస్తున్న బాలకార్మికులను గుర్తించి 9 మందిని అదుపులోకి  తీసుకున్నారు.

ఈ విషయాన్ని ముందే పసిగట్టిన పలు దుకాణాల్లో పనిచేస్తున్న బాలకార్మికులను మరోచోటుకు తరలించారు. పట్టుబడ్డ వారిలో విద్యార్థులు నిసాక్, ప్రవీణ్, నవీన్‌, ఇమ్రాన్‌ఖాన్‌,  నరేశ్, భానుప్రసాద్, ఇలియాస్, ఫారూఖ్, ప్రశాంత్‌ ఉన్నారు. వీరిని దొంతి గ్రామంలో ఉన్న బాలల సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని భాస్కర్‌రావు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement