దళితులపై దాడులను అరికట్టాలి | dalitulapi dadulanu arikattali | Sakshi
Sakshi News home page

దళితులపై దాడులను అరికట్టాలి

Jul 26 2016 5:59 PM | Updated on Sep 15 2018 3:01 PM

దళితులపై దాడులను అరికట్టాలి - Sakshi

దళితులపై దాడులను అరికట్టాలి

ఏలూరు (సెంట్రల్‌): దళితులపై రోజురోజుకు జరుగుతున్న దాడులను అరికట్టాలని, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాలమహానాడు రాష్ట్ర సమన్వయకర్త నల్లి రాజేష్‌ జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ను కోరారు.

ఏలూరు (సెంట్రల్‌): దళితులపై రోజురోజుకు జరుగుతున్న దాడులను అరికట్టాలని, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాలమహానాడు రాష్ట్ర సమన్వయకర్త నల్లి రాజేష్‌ జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ను కోరారు.  ఇటీవల యలమంచిలి మండలం బాడావలో దళితులపై దాడులకు పాల్పడిన వారిపై అట్రాసీటి కేసు నమోదు చేసి, వారిని అరెస్టు చేయాలంటూ వినతిపత్రం సమర్పించారు. అనంతరం నల్లి రాజేష్‌ మాట్లాడుతూ కొందరు వ్యక్తులు   ఈనెల 14న బాడావలో దళితులపై దాడులకు పాల్పడడంతో పాటు మరుసటి రోజు బైక్‌లపై వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లడటంతో పాటు దాడులు చేశారని అన్నారు. వీరిని కఠినంగా శిక్షించాలని ఎస్పీని కోరినట్టు చెప్పారు. మాలమహానాడు నాయకులు కె.జోగయ్య, ఎం.నరసింహరావు, విపర్తి నవీన్, నల్లి జయరాజు, మత్తే బాబీ, తోటే సుందరం తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement