టోల్‌గేట్ వద్ద నోట్ల రగడ | currency notes ban controversy at toll gates | Sakshi
Sakshi News home page

టోల్‌గేట్ వద్ద నోట్ల రగడ

Nov 9 2016 9:46 AM | Updated on Sep 22 2018 7:51 PM

టోల్‌గేట్ సిబ్బంది రూ. 500, రూ. 1000 నోట్లు తీసుకోకపోవడంతో.. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది

మంగళగిరి: టోల్‌గేట్ సిబ్బంది రూ. 500, రూ. 1000 నోట్లు తీసుకోకపోవడంతో.. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని ఖాజా టోల్‌ప్లాజా వద్ద బుధవారం ఉదయం నుంచి ‘పెద్ద’ నోట్లు తీసుకోవడం లేదు. దీంతో లారీ డ్రైవర్‌లు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన చిల్లర ఇవ్వాలని టోల్‌గేట్ సిబ్బంది చెప్తుండటంతో.. డ్రైవర్‌లు సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పెట్రోల్ బంకుల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది.
 

Advertisement
 
Advertisement
Advertisement