ఈ నెల 18, 19 తేదీలలో రాప్తాడు మండలం మరూరులోని చిన్న కదిరయ్య స్వామి దేవాలయంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, మండల, గ్రామ శాఖ కార్యదర్శులు, నాయకులకు వర్క్‌షాప్ ఉంటుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ తెలిపారు.
అనంతపురం అర్బన్ : ఈ నెల 18, 19 తేదీలలో రాప్తాడు మండలం మరూరులోని చిన్న కదిరయ్య స్వామి దేవాలయంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, మండల, గ్రామ శాఖ కార్యదర్శులు, నాయకులకు వర్క్‌షాప్ ఉంటుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ తెలిపారు. నగరంలోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఈ వర్క్‌షాపును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రారంభిస్తారని, ఇందులో దాదాపు 300 మందికి పలు అంశాలపై శిక్షణ ఇస్తారని తెలిపారు. 18న సింగమనేని నారాయణ, వెంకటరత్నం, తలేంద్ర, 19న సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, కె.రాజశేఖర్ వివిధ అంశాలపై శిక్షణ ఇస్తారని తెలిపారు.