వైఎస్సార్ కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది
రాజంపేట(వైఎస్సార్‌జిల్లా): వైఎస్సార్ కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని రాజంపేట మండలం మందరం గొల్లపల్లిలో భార్యాభర్తలు వంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య(40), వెంకట సుబ్బమ్మ(37) దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో గురువారం రాత్రి వీరిధ్దరి మధ్య మరోసారి గొడవ జరగడంతో.. మనస్తాపానికి గురై ఇద్దరు కలిసి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారు. వారిని ఆస్పత్రికి తరలించడానికి యత్నించగా.. అప్పటికే మృతిచెందారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.