లోపలను సరిదిద్దుతున్నాం | correcting loops | Sakshi
Sakshi News home page

లోపలను సరిదిద్దుతున్నాం

Aug 17 2016 8:46 PM | Updated on Sep 4 2017 9:41 AM

లోపలను సరిదిద్దుతున్నాం

లోపలను సరిదిద్దుతున్నాం

కృష్ణా, గుంటూరు జిల్లాలో పుష్కరఘాట్లు, వార్డుల్లో 2.20 లక్షల మంది యాత్రికులకు వైద్య సేవలందించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాలకురాలు (డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌) డాక్టర్‌ అరుణకుమారి చెప్పారు. వారిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రిలో 215 మందిని చేర్చి చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

పుష్కర శిబిరాల్లో 2.20 లక్షల మందికి పరీక్షలు  
‘సాక్షి’తో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాలకురాలు అరుణకుమారి
విజయవాడ(లబ్బీపేట) : 
కృష్ణా, గుంటూరు జిల్లాలో పుష్కరఘాట్లు, వార్డుల్లో 2.20 లక్షల మంది యాత్రికులకు వైద్య సేవలందించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాలకురాలు (డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌) డాక్టర్‌ అరుణకుమారి చెప్పారు. వారిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రిలో 215 మందిని చేర్చి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. 3 వేల మందికిపైగా వైద్యులు, సిబ్బంది పని చేస్తున్నట్లు వివరించారు.  పాత ప్రభుత్వాస్పత్రిలోని వైద్య ఆరోగ్యశాఖ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో పుష్కరాల్లో అందిస్తున్న వైద్య సేవలను ఆమె సాక్షికి వివరించారు. 
లోపాలను సరిదిద్దుకుంటున్నాం..
తొలుత వైద్య శిబిరాలు ఏర్పాటులో కొన్ని లోపాలు గుర్తించాం, వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు పోతున్నాం. ప్రథమ చికిత్స, ఫస్ట్‌లెవల్‌ రిఫరల్‌ సెంటర్, ప్రత్యేక వార్డులు అనే మూడంచెల వ్యవస్థను అమలు చేస్తున్నామని చెప్పారు.
మందులు సిద్ధంగా ఉంచాం..
అన్ని వైద్య శిబిరాల్లో మందులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాం. కుక్క, పాము కాటుకు కూడా మందులు సిద్ధం ఉంచినట్లు పేర్కొన్నారు. ఆయాసంతో వచ్చిన వారికోసం నెబిలేజర్స్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం సిలిండర్స్‌ అవసరం లేకుండా గాలిలోని ఆక్సిజన్‌ను సేకరించి రోగులకు అందించే‘ ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేట్‌’ పరికరాలు ఫస్ట్‌లెవల్‌ రిఫరల్‌ సెంటర్‌లో అందుబాటులోఉంచినట్లు ఆమె తెలిపారు. శిబిరాలకు ఆస్తమా, దగ్గు, జలుబు, జ్వరంతో ఎక్కువ మంది వస్తున్నారని వివరించారు. సేవలను పుష్కరాల ముగిసే వరకు పూర్తి స్థాయిలో అందిస్తామని డాక్టర్‌ అరుణకుమారి వివరించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement