breaking news
correcting
-
మెల్లను నయంచేసే హెడ్సెట్.. కళ్లద్దాలు, ఆపరేషన్లు అవసరం లేదు!
కంటి సమస్యల్లో మెల్ల చిన్నప్పుడే ఏర్పడి, జీవితాంతం వేధిస్తుంది. లావాటి కళ్లద్దాలతో మెల్ల వల్ల ఏర్పడే దృష్టిలోపాన్ని చక్కదిద్దుకోవచ్చు. శస్త్రచికిత్సతో మెల్లకన్నును పూర్తిగా మామూలుగా చేసుకోవచ్చు. అయితే, ఇవి కొంత ఇబ్బందికరమైన ప్రక్రియలు. మెల్లను నయం చేయడానికి ఇటీవల దక్షిణ కొరియాకు చెందిన త్రీడీ విజువల్ డిజైనర్ హేచాన్ ర్యు ఒక ప్రత్యేకమైన హెడ్‌సెట్‌ని రూపొందించారు. ‘సింప్లిసిటీ విత్ ప్రొఫెషనలిజం’ (ఎస్‌డబ్ల్యూపీ) పేరుతో రూపొందించిన ఈ హెడ్‌సెట్‌ని కళ్లను కప్పి ఉంచేలా తయారు చేశారు. ఇందులోని లెన్స్ దీనిని ధరించిన వారి లోపానికి అనుగుణంగా సర్దుకుని, సౌకర్యవంతంగా చూసేందుకు వీలు కల్పిస్తాయి. ఈ హెడ్‌సెట్‌లోని మోటరైజ్డ్ ప్రిజమ్ లోపల తిరుగుతూ కళ్లకు తగిన వ్యాయామం కల్పిస్తుంది. ఇది క్రమంగా మెల్లకంటిని సరైన కోణంలోకి తీసుకొస్తుంది. లోపం పూర్తిగా నయమయ్యేంత వరకు దీనిని కొన్ని వారాల నుంచి నెలల పాటు వాడాల్సి ఉంటుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. -
లోపలను సరిదిద్దుతున్నాం
పుష్కర శిబిరాల్లో 2.20 లక్షల మందికి పరీక్షలు ‘సాక్షి’తో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాలకురాలు అరుణకుమారి విజయవాడ(లబ్బీపేట) : కృష్ణా, గుంటూరు జిల్లాలో పుష్కరఘాట్లు, వార్డుల్లో 2.20 లక్షల మంది యాత్రికులకు వైద్య సేవలందించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాలకురాలు (డైరెక్టర్ ఆఫ్ హెల్త్) డాక్టర్ అరుణకుమారి చెప్పారు. వారిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రిలో 215 మందిని చేర్చి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. 3 వేల మందికిపైగా వైద్యులు, సిబ్బంది పని చేస్తున్నట్లు వివరించారు. పాత ప్రభుత్వాస్పత్రిలోని వైద్య ఆరోగ్యశాఖ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌లో పుష్కరాల్లో అందిస్తున్న వైద్య సేవలను ఆమె సాక్షికి వివరించారు. లోపాలను సరిదిద్దుకుంటున్నాం.. తొలుత వైద్య శిబిరాలు ఏర్పాటులో కొన్ని లోపాలు గుర్తించాం, వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు పోతున్నాం. ప్రథమ చికిత్స, ఫస్ట్‌లెవల్ రిఫరల్ సెంటర్, ప్రత్యేక వార్డులు అనే మూడంచెల వ్యవస్థను అమలు చేస్తున్నామని చెప్పారు. మందులు సిద్ధంగా ఉంచాం.. అన్ని వైద్య శిబిరాల్లో మందులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాం. కుక్క, పాము కాటుకు కూడా మందులు సిద్ధం ఉంచినట్లు పేర్కొన్నారు. ఆయాసంతో వచ్చిన వారికోసం నెబిలేజర్స్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం సిలిండర్స్ అవసరం లేకుండా గాలిలోని ఆక్సిజన్‌ను సేకరించి రోగులకు అందించే‘ ఆక్సిజన్ కాన్సన్ట్రేట్’ పరికరాలు ఫస్ట్‌లెవల్ రిఫరల్ సెంటర్లో అందుబాటులోఉంచినట్లు ఆమె తెలిపారు. శిబిరాలకు ఆస్తమా, దగ్గు, జలుబు, జ్వరంతో ఎక్కువ మంది వస్తున్నారని వివరించారు. సేవలను పుష్కరాల ముగిసే వరకు పూర్తి స్థాయిలో అందిస్తామని డాక్టర్ అరుణకుమారి వివరించారు.