ఓటర్ల జాబితాను సరిచేయాలి | correct the voterlist | Sakshi
Sakshi News home page

ఓటర్ల జాబితాను సరిచేయాలి

Aug 19 2016 12:21 AM | Updated on Sep 4 2017 9:50 AM

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: ఓటర్ల జాబితాల్లో చోటు చేసుకున్న తప్పులను ఈ నెల 22 లోపు సరిచేయాలని చీఫ్‌ ఎన్నికల అధికారి బన్వర్‌లాల్‌ సూచించారు. గురువారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా అధికారులతో సమీక్షించారు.

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: ఓటర్ల జాబితాల్లో చోటు చేసుకున్న తప్పులను ఈ నెల 22 లోపు సరిచేయాలని చీఫ్‌ ఎన్నికల అధికారి బన్వర్‌లాల్‌ సూచించారు. గురువారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా అధికారులతో సమీక్షించారు. ఓటర్ల జాబితాలోని తప్పులు, డబుల్‌ ఎంట్రీలు, కచ్చితమైన ఫోటోలు, ఓటర్‌ వివరాలు సరిచేయడంతో పాటు  డూప్లికేట్‌ ఓటర్లను జాబితా నుంచి తొలగించాలని అన్నారు. మున్సిపాలిటీలలోని పోలింగ్‌ కేంద్రాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి బౌండరీలను పేపర్‌పై స్కెచ్‌ వేసుకొని గూగుల్‌ మ్యాప్‌కు అప్‌లోడ్‌ చేయాలని సూచించారు.కచ్చితమైన ఓటర్‌ వివరాలతో సెప్టెంబర్‌ 31 వరకు సాంకేతిక ప్రక్రియను పూర్తి చేసి డ్రాఫ్ట్‌ ఓటర్‌ జాబితాలను ప్రకటించాలని అన్నారు. వీసీలో డిఆర్వో భాస్కర్, ఎన్‌ఐసీ డీఐఓ మూర్తి, ఎన్నికల విభాగం సీనియర్‌ సహాయకులు హనీఫ్, కృష్ణకుమార్‌లు హాజరయ్యారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement