ఐక ఫ్రంట్‌తో అవినీతికి కళ్లెం | common union rduse correcption | Sakshi
Sakshi News home page

ఐక ఫ్రంట్‌తో అవినీతికి కళ్లెం

Aug 21 2016 6:08 PM | Updated on Sep 4 2017 10:16 AM

ఐక ఫ్రంట్‌తో అవినీతికి కళ్లెం

ఐక ఫ్రంట్‌తో అవినీతికి కళ్లెం

జ్యోతినగర్‌ : ఐక్య ఫ్రంట్‌తోనే అవినీతికి కళ్లెం వేయడం సాధ్యమని, గుర్తింపు సంఘం ఎన్నికలలో ఎన్టీపీసీ రామగుండం ఉద్యోగులు ఐక్యఫ్రంట్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని డెమోక్రటిక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధానకార్యదర్శి సీహెచ్‌.ఉపేందర్‌ అన్నారు. ఎన్టీపీసీ జ్యోతినగర్‌ ఎఫ్‌సీఐ క్రాస్‌ రోడ్‌లోని శ్వేత హాల్‌లో ఆదివారం మాట్లాడారు.

  • ఐఎన్‌టీయూసీ ఓ అబద్ధాల పుట్ట
  • డెమోక్రటిక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధానకార్యదర్శిఉపేందర్‌
  • జ్యోతినగర్‌ : ఐక్య ఫ్రంట్‌తోనే అవినీతికి కళ్లెం వేయడం సాధ్యమని, గుర్తింపు సంఘం ఎన్నికలలో ఎన్టీపీసీ రామగుండం ఉద్యోగులు ఐక్యఫ్రంట్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని డెమోక్రటిక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధానకార్యదర్శి సీహెచ్‌.ఉపేందర్‌ అన్నారు. ఎన్టీపీసీ జ్యోతినగర్‌ ఎఫ్‌సీఐ క్రాస్‌ రోడ్‌లోని శ్వేత హాల్‌లో ఆదివారం మాట్లాడారు. ఎన్టీపీసీ రామగుండం సంస్థలో ఈసారి గుర్తింపు సంఘం ఎన్నికలను యాజమాన్యం నిర్వహిస్తుంని వెల్లడించారు. సెప్టెంబర్‌–13న జరుగనున్న ఎన్నికలలో ఐక్యఫ్రంట్‌ నేతృత్వంలో ఎన్టీపీసీ డెమోక్రటిక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (హెచ్‌ఎంఎస్‌)బ్యానర్‌పై పోటీచేయడం జరుగుతుందన్నారు. గుర్తింపు సంఘంగా కొనసాగిన ఐఎన్‌టీయూసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం ప్రదర్శించడంతోనే జనరేషన్‌ ఇన్సెంటివ్‌ రద్దు అయిందని పేర్కొన్నారు. సంస్థలో సర్వీస్‌లేని వ్యక్తి అజమాయిషీలో ఐఎన్టీయూసీ కొనసాగడం బాధాకరమని అన్నారు. ప్రస్తుతం ఐఎన్‌టీయూసీ బాబర్‌ కంపెనీలా తయారైందని ఎద్దేవా చేశారు. జనవరిలో జరుగనున్న వేతన సవరణ ఒప్పందంలో మెరుగైన వేతన సవరణ ఉద్యోగులకు దక్కాలంటే ఐక్యఫ్రంట్‌ను గెలిపించాలన్నారు. సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ యూనియన్లు మద్దతు తెలిపాయని రానున్న రోజుల్లో మరిన్ని యూనియన్లు ఐక్యఫ్రంట్‌కు మద్దతు తెలిపేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయని వివరించారు. ఎన్టీపీసీ యునైటెడ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(సీఐటీయూ) అధ్యక్షుడు కనకరాజు, ప్రధాన కార్యదర్శి మాధవరావు మాట్లాడుతూ ఎన్టీపీసీ రామగుండం ఉద్యోగ గుర్తింపు సంఘం ఎన్నికల్లో హెచ్‌ఎంఎస్‌ యూనియన్‌కు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. సమావేశంలో హెచ్‌ఎంఎస్, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ, మినిస్ట్రియల్‌ స్టాఫ్‌కు చెందిన అశోక్, వీరయ్య, మొగురం గట్టయ్య, కొమ్ము గోపాల్, అశోక్‌రాజు, జనార్దన్‌రెడ్డి, భాస్కర్‌కుమార్, దిలీప్‌కుమార్, సత్యనారాయణ, జి.సత్యనారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement