క్రీడలతో స్నేహ సంబంధాలు

క్రీడలతో స్నేహ సంబంధాలు


కల్లూరు: క్రీడలతో స్నేహ సంబంధాలు మెరగుపడతాయని రాయలసీమ యూనివర్సిటీ వైఎస్‌ ఛాన్స్‌లర్‌ వై. నరసింహులు అన్నారు. గురువారం నగరంలోని కేవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాల క్రీడా మైదానంలో రాయలసీమ యూనివర్సిటీ మహిళా అంతర్‌ కళాశాలల క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా ఆయన.. బాల్‌ సర్వీసు చేసి వాలీబాల్‌ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటమి చెందిన క్రీడాకారులు కలత చెందకుండా మరో పోటీకి సిద్ధం కావాలన్నారు. ఉత్తమ క్రీడా నైపుణ్యాలు ప్రదర్శించి అంతర్‌ విశ్వవిద్యాలయ క్రీడా పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపల్‌ రాజేశ్వరి మాట్లాడుతూ బాల్‌బాడ్మింటన్‌ 7 జట్లు, వాలీబాల్‌ 7 జట్లు, ఖోఖో 10 జట్లు వచ్చాయని, షెడ్యూల్‌ ప్రకారం  పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. సాంస్కతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో టోర్నమెంట్‌ కార్యదర్శి కాలేజ్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌ విజయభారతి, యూనివర్సిటీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ కేవీ శివకిశోర్, పీఈటీలు, కాలేజ్‌ అధ్యాపకులు, సిబ్బంది క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

విజేతలు వీరే..

  బాల్‌బాడ్మింటన్‌లో కోడుమూరు కాలేజ్‌ జట్టు, ఉస్మానియా కాలేజ్‌ జట్టుపై 29–4 పాయింట్లతో గెలిచింది.  కేవీఆర్‌ కాలేజ్‌ జట్టుపై కోడుమూరు ఎస్‌విడిసి జట్టు, ఎస్‌పివై రెడ్డి కాలేజ్‌ జట్టుపై సెయింట్‌ జోసఫ్‌ కాలేజ్‌ జట్టు విజయం సాధించింది. వాలీబాల్‌లో ఎస్పీవైరెడ్డి కాలేజ్‌ జట్టుపై ఉస్మానియా కాలేజ్‌ జట్టు (25–18, 25–12), సెయింట్‌ జోసఫ్‌ కాలేజ్‌ వెంకాయపల్లె జట్టుపై  సెయింట్‌ జోసఫ్‌ సుంకేసుల రోడ్డు కాలేజ్‌  జట్టు (25–19, 25–15), కోడుమూరు కాలేజ్‌ జట్టుపై కేవీఆర్‌ కాలేజ్‌ జట్టు (25–13, 25–10) పాయింట్ల తేడాతో విజయం సాధించాయి. ఖోఖోలో నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌ జట్టుపై కేవీఆర్‌ కాలేజ్‌ జట్టు (15–0) పాయింట్లతేడాతో విజయం సాధించింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags:  

Read also in:
Back to Top