రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 19 లేదా 20న జిల్లాలో పర్యటించనున్నారు.
19, 20 తేదీల్లో ముఖ్యమంత్రి పర్యటన
Apr 17 2017 10:35 PM | Updated on Aug 14 2018 11:26 AM
– ఓర్వకల్లు మండలం కొమ్ముచెరువులో నీరు–చెట్టు పనులు ప్రరంభించే అవకాశం
కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 19 లేదా 20న జిల్లాలో పర్యటించనున్నారు. శాసనమండలి ఎన్నికల కోడ్, అసెంబ్లీ సమావేశాల కారణంగా రెండు నెలలకు పైగా ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలు లేవు. తాజాగా కర్నూలు జిల్లాతో మళ్లీ పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 15నే ముఖ్యమంత్రి పర్యటన ఉండగా వాయిదా పడింది. తాజాగా 19 లేదా 20వ తేదీల్లో పర్యటించే అవకాశం ఉండటంతో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఓర్వకల్లు మండలం కొమ్ముచెరువులో ముఖ్యమంత్రి నీరు–చెట్టు పనులు ప్రారంబించనున్నట్లు సమాచారం. అదేవిధంగా ఓర్వకల్‌లో జరిగే వివిధ కార్యాక్రమాల్లో పాల్గొంటారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ వివిధ శాఖల అధికారులతో కలిసి కొమ్ముచెరువును పరిశీలించారు.
Advertisement
Advertisement