బాలికకు పూర్తి న్యాయం చేస్తాం | child rape case investigation | Sakshi
Sakshi News home page

బాలికకు పూర్తి న్యాయం చేస్తాం

Oct 1 2016 10:33 PM | Updated on Sep 4 2017 3:48 PM

బాలికకు పూర్తి న్యాయం చేస్తాం

బాలికకు పూర్తి న్యాయం చేస్తాం

అమలాపురం మున్సిపల్‌ కాలనీలో లైంగిక దాడికి గురైన మానసిక వికలాంగ బాలికను, ఆ కుటుంబాన్ని రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి శనివారం పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అత్యాచారానికి ముందు మూడు రోజులుగా నా బిడ్డ మాట్లాడలేక కన్నీళ్ల పర్యంతమవుతుంటే ఆమె జబ్బు ఇబ్బంది పెడుతోందేమో అనుకున్నాను తప్ప, అప్పటికి మూడు రోజులుగా ఆమెపై లైంగిక దాడి జరుగుతుండడం వల్లే నరక యాతన అనుభవిస్తోందని

  •  రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు రాజ్యలక్ష్మి
  •  లైంగిక దాడి ఘటనపై విచారణ
  • అమలాపురం టౌన్‌ :
    అమలాపురం మున్సిపల్‌ కాలనీలో లైంగిక దాడికి గురైన మానసిక వికలాంగ బాలికను, ఆ కుటుంబాన్ని రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి శనివారం పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అత్యాచారానికి ముందు మూడు రోజులుగా నా బిడ్డ మాట్లాడలేక కన్నీళ్ల పర్యంతమవుతుంటే ఆమె జబ్బు ఇబ్బంది పెడుతోందేమో అనుకున్నాను తప్ప, అప్పటికి మూడు రోజులుగా ఆమెపై లైంగిక దాడి జరుగుతుండడం వల్లే నరక యాతన అనుభవిస్తోందని తెలుసుకోలేకపోయానని ఆ తల్లి కన్నీరు మున్నీరైంది. రాజ్యలక్ష్మి విలేకర్లతో మాట్లాడుతూ బాధిత బాలికకు పూర్తి న్యాయం చేసే లా కమిషన్‌ ఆ కుటుంబాన్ని ఆదుకుంటుందని, బాలికకు జరిగిన అన్యాయంపై పూర్తిస్థాయిలో నివేదిక ఇస్తానని ఆమె పేర్కొన్నారు. సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌ నుంచి కూడా నిందితుడిపై పెట్టిన కేసులు దర్యాప్తు ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ విచారణలో మున్సిపల్‌ కౌన్సిలర్‌ గంపల నాగలక్ష్మి, దండోరా నాయకుడు గంపల సత్యప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement