రైలులో మగశిశువు మృతదేహం | child body in train | Sakshi
Sakshi News home page

రైలులో మగశిశువు మృతదేహం

Jan 6 2017 11:55 PM | Updated on Sep 5 2017 12:35 AM

ఎక్స్‌ప్రెస్‌ రైలులో మగశిశువు మృతదేహాన్ని వదిలేసి వెళ్లిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది.

గుంతకల్లు : ఎక్స్‌ప్రెస్‌ రైలులో మగశిశువు మృతదేహాన్ని వదిలేసి వెళ్లిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. జీఆర్‌పీ పోలీసులు, ప్రయాణికులు తెలిపిన మేరకు.. తిరుపతి నుంచి బయల్దేరిన నిజామోద్దీన్‌ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో స్లీపర్‌ కోచ్‌-8లో ఎవరో పింక్‌ కలర్‌ చీరలో మృత మగశిశువును చుట్టి వదిలేశారు. కొందరు ప్రయాణికులు గుర్తించి గుంతకల్లు జీఆర్‌పీ పోలీసులకు సమాచారం అందించారు. రైలు గుంతకల్లు స్టేషన్‌కు చేరుకున్న వెంటనే పోలీసులు కోచ్‌లోని మృతశిశువును స్వాధీనం చేసుకుని, అంత్యక్రియలు పూర్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement