సీసీ పుటేజీతో చిక్కాడు | CAUGHT ON CC PUTAGE | Sakshi
Sakshi News home page

సీసీ పుటేజీతో చిక్కాడు

Dec 11 2016 1:41 AM | Updated on Aug 30 2018 5:27 PM

సీసీ పుటేజీతో చిక్కాడు - Sakshi

సీసీ పుటేజీతో చిక్కాడు

వృద్ధురాలి వద్ద నగదు లాక్కొని పారిపోయిన నిందితుడిని పెనుగొండ ఎస్‌బీఐ బ్రాంచ్‌ వద్ద ఏర్పాటుచేసిన సీసీ కెమెరా పట్టించింది.

పెనుగొండ : వృద్ధురాలి వద్ద నగదు లాక్కొని పారిపోయిన నిందితుడిని పెనుగొండ ఎస్‌బీఐ బ్రాంచ్‌ వద్ద ఏర్పాటుచేసిన సీసీ కెమెరా పట్టించింది. నరసాపురం డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు, సీఐ సీహెచ్‌ రామారావు తెలిపిన వివరాల ప్రకా రం.. గతనెల 24న చెరుకువాడకు చెందిన కుంచే బర్రెమ్మ అనే వృద్ధురాలు నగదు మార్పిడి కోసం రూ,1,08,000 తీసుకుని పెనుగొండ ఆంధ్రాబ్యాంకుకు వెళ్లింది. బ్యాంకు సిబ్బ ంది ఆధార్, పా¯ŒS కార్డులు కావాలనడంతో తిరిగి నగదుతో వస్తుండగా స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌ వద్ద మో టారుసైకిల్‌పై గుర్తుతెలియని వ్యక్తి ఆమె చేతిలోని బ్యాగ్‌ లాక్కుని పారిపోయాడు. దీనిపై పెనుగొండ పోలీసులు కేసు నమోదుచేశారు. దర్యాప్తులో భాగంగా ఎస్‌బీఐ వద్ద సీసీ కె మెరా పుటేజీ పరిశీలించగా హోండా యాక్టీవా స్కూటర్‌పై వెళుతున్న నేరస్తుడిని గుర్తించారు. నిందితుడు నిడదవోలు పోలీసుస్టేçÙ¯ŒS పరిధిలో సస్పెక్ట్‌ షీటు ఉన్న ఊర్ల శ్రీనువాసుగా నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. పెనుగొండతో పాటు, తూర్పువిప్పర్రులో బ్యాంకు వద్ద జరిగిన చోరీను కూడా తాను చేసినట్టు అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్‌ చేసి రూ.37 వేలు రికవరీ చేసినట్టు చెప్పారు. కేసు ఛేదించడంలో కానిస్టేబుళ్లు కొండా, రమేష్‌ చురుగ్గా వ్యవహరించారన్నారు. పెనుగొండ, ఇరగవరం ఎస్సైలు బీవై కిరణ్‌కుమార్, జీజే ప్రసాద్‌ పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement