ఘాట్ల నిర్మాణం త్వరగా పూర్తిచేయాలి | C0MPLETE Ghat WORKS Fastly | Sakshi
Sakshi News home page

ఘాట్ల నిర్మాణం త్వరగా పూర్తిచేయాలి

Aug 7 2016 9:43 PM | Updated on Sep 4 2017 8:17 AM

ఘాట్‌పై ఫ్లోరింగ్‌ పనులు పరిశీలిస్తున్న జెడ్పీ సీఈఓ

ఘాట్‌పై ఫ్లోరింగ్‌ పనులు పరిశీలిస్తున్న జెడ్పీ సీఈఓ

అలంపూర్‌ : పుష్కర పనులు త్వరగా పూర్తి చేయాలని జెడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణ కాంట్రాక్టర్‌లకు సూచించారు. మండల పరిధిలోని గొందిమల్ల జోగుళాంబ ఘాట్‌ను ఆదివారం ఆయనతో పాటు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ ప్రసాద్‌రెడ్డి, డ్వామా పీడీ దామోదర్, హౌసింగ్‌ పీడీ రమణరావు, డీఎల్‌పీఓ వెంకటేశ్వర్లు సందర్శించారు.

– గొందిమల్ల ఘాట్‌ను పరిశీలించిన జెడ్పీ సీఈఓ 
– గొందిమల్లలోనే సీఈఓ, ఎస్‌ఈలు, పీడీ బస 
అలంపూర్‌ : పుష్కర పనులు త్వరగా పూర్తి చేయాలని జెడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణ కాంట్రాక్టర్‌లకు సూచించారు. మండల పరిధిలోని గొందిమల్ల జోగుళాంబ ఘాట్‌ను ఆదివారం ఆయనతో పాటు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ ప్రసాద్‌రెడ్డి, డ్వామా పీడీ దామోదర్, హౌసింగ్‌ పీడీ రమణరావు, డీఎల్‌పీఓ వెంకటేశ్వర్లు సందర్శించారు. పుష్కర ఘాట్‌ నిర్మాణ పనులు, తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, పార్కింగ్‌ పనులను సమీక్షించారు. పుష్కరాలకు కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండటంతో నిర్మాణంలో ఉన్న పనులు ముందుగా సూచించినట్లుగా 8వ తేదీకి పూర్తి చేయాలన్నారు. పార్కింగ్‌ పనులు పూర్తిచేస్తే భారీ కేడ్లు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని చెప్పారు. అనంతరం జెడ్పీసీఈఓతోపాటు ఇతర శాఖల అధికారులు అక్కడే బస చేశారు. వీరితోపాటు తహసీల్దార్‌ మంజుల, ఎంపీడీఓ మల్లికార్జున్, ఈఓ ఆర్డీఓ రమణరావు ఉన్నారు. 
 
 
 

Advertisement
Advertisement