రాయలసీమ పేరుతో పెట్టుకున్న పార్టీకి ప్రజల మద్దతు లేకపోవడంతో బైరెడ్డి రాజశేఖరరెడ్డి రాజకీయ నిరుద్యోగిగా మారారని తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ సంఘం జాతీయ సభ్యుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు.
రాజకీయ నిరుద్యోగి బైరెడ్డి
Jun 11 2017 12:01 AM | Updated on Aug 10 2018 8:26 PM
– డీడీపీ నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు ధ్వజం
కర్నూలు(టౌన్): రాయలసీమ పేరుతో పెట్టుకున్న పార్టీకి ప్రజల మద్దతు లేకపోవడంతో బైరెడ్డి రాజశేఖరరెడ్డి రాజకీయ నిరుద్యోగిగా మారారని తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ సంఘం జాతీయ సభ్యుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ అభివృద్ధికి కృషి చేస్తున్నా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనవసరంగా ఆయనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అలగనూరు, మల్యాల ప్రాజెక్టుల్లో పర్సంటేజీలు రానందుకే ఆ విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీమపై నిజంగా ప్రేమ ఉంటే విమర్శలు మాని ప్రభుత్వా నికి మంచి సలహాలు ఇవ్వాలని సూచించారు.
Advertisement
Advertisement