బిగ్ బజార్ నిర్వాహకుల అలసత్వం ఓ బాలుడి ప్రాణాల మీదకు తెచ్చింది.
హైదరాబాద్: బిగ్ బజార్ నిర్వాహకుల అలసత్వం ఓ బాలుడి ప్రాణాల మీదకు తెచ్చింది. షాపింగ్ చేయడానికి తల్లిదండ్రులతో కలిసి వచ్చిన ఓ చిన్నారి రైడర్ కారుతో ఆడుకుంటూ.. ప్రమాదవశాత్తు ఎస్కలేటర్ పై నుంచి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. నగరంలోని కాచిగూడ బిగ్‌బజార్‌లో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
దిల్‌సుఖ్ నగర్‌కు చెందిన అభిరామ్(3) తల్లిదండ్రులతో కలిసి మంగళవారం రాత్రి మాల్ షాపింగ్ చేస్తుండగా.. బొమ్మ కారుతో ఆడుకుంటూ ఎస్కలేటర్ పై నుంచి కిందపడ్డాడు. బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో లక్డీకపూల్ లోని లోటస్ ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.