ఎరువులో బోరు మట్టి ! | bohr dust in fertilizer | Sakshi
Sakshi News home page

ఎరువులో బోరు మట్టి !

Mar 19 2017 10:00 PM | Updated on Apr 3 2019 5:52 PM

ఎరువులో బోరు మట్టి ! - Sakshi

ఎరువులో బోరు మట్టి !

మండల వ్యాప్తంగా కల్తీ ఎరువులు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఎరువులో బోరు మట్టిని కలిపి విక్రయిస్తుండడంతో రైతులు గుర్తించలేకపోతున్నారు.

చెన్నేకొత్తపల్లి : మండల వ్యాప్తంగా కల్తీ ఎరువులు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఎరువులో బోరు మట్టిని కలిపి విక్రయిస్తుండడంతో రైతులు గుర్తించలేకపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామానికి చెందిన రైతు సూరి గోరు చిక్కుడు సాగు చేశారు. 15 రోజుల క్రితం ధర్మవరంలోని ఓ ఎరువుల దుకాణం నుంచి 17-17-17 రకం కాంప్లెక్స్‌ ఎరువును కొనుగోలు చేశారు. డ్రిప్‌ ద్వారా పంటకు అందజేసేందుకు రెండు కిలోల ఎరువును బకెట్‌ నీటిలో కలిపితే బకెట్‌ అడుగున బోరు మట్టి పేరుకుపోయి కనిపించింది. దీంతో మరికొందరు రైతులను ఆయన విచారణ చేయగా మరికొందరికి ఇలాంటి అనుభవమే ఎదురైనట్లు తెలిసింది. అధికారులు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement