బ్యాంకు మేనేజర్ పేరుతో బురిడీ | bihari cash with draw for N .Veerabhadram account through atm | Sakshi
Sakshi News home page

బ్యాంకు మేనేజర్ పేరుతో బురిడీ

Dec 24 2015 9:27 AM | Updated on Sep 3 2017 2:31 PM

బ్యాంకు మేనేజర్ పేరుతో బురిడీ

బ్యాంకు మేనేజర్ పేరుతో బురిడీ

స్టేట్‌బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్‌గా ఫోన్లో పరిచయం చేసుకున్న వ్యక్తి ఏటీఎం కార్డు రెన్యువల్ చేయాలంటూ పిన్ నంబర్లు తెలుసుకుని ఏటీఎంలో నగదు కాజేసిన సంఘటన పిఠాపురంలో బుధవారం సంచలనం రేపింది.

ఏటీఎం నుంచి డబ్బు కాజేసిన బీహారీ?


పిఠాపురం : స్టేట్‌బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్‌గా ఫోన్లో పరిచయం చేసుకున్న వ్యక్తి ఏటీఎం కార్డు రెన్యువల్ చేయాలంటూ పిన్ నంబర్లు తెలుసుకుని ఏటీఎంలో నగదు కాజేసిన సంఘటన పిఠాపురంలో  బుధవారం సంచలనం రేపింది. పోలీసుల కథనం ప్రకారం పట్టణ శివారు అగ్రహారానికి చెందిన కిరాణా వ్యాపారి నున్న వీరభద్రం, అతడి భార్య పార్వతి సెల్ ఫోన్లకు మంగళవారం ఒక ఫోన్ వచ్చింది.

తాను స్టేట్‌బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్‌నని అవతలి వ్యక్తి ఫోన్లో పరిచయం చేసుకున్నాడు. ఏటీఎం కార్డు గడువు ముగిసింది కనుక రెన్యువల్ చేయాలని, అందుకు కార్డ్ నంబర్ చెప్పాలని ఆ వ్యక్తి అడిగాడు. వారు తమ ఏటీఎం కార్డు నంబర్ చెప్పారు. అతడు మళ్లీ ఫోన్ చేసి మీ ఫోన్‌కు ఒక పిన్ నంబర్ వస్తుంది, దానిని చెప్పమనడంతో వారు ఆ నంబర్ కూడా చెప్పారు.

తిరిగి బుధవారం ఆ వ్యక్తి ఫోన్ చేసి పని పూర్తి కాలేదని, మరో పిన్ నంబర్ వస్తుందని చెప్పాడు. ఆ నంబర్‌కూడా వారు అతడికి చెప్పారు. అనంతరం వారికి అనుమానం కలిగి దగ్గరలోని ఏటీఎంకి వెళ్లి ఖాతాలో డబ్బు చూసుకున్నారు. అందులోనుంచి రూ.18,999 డ్రాచేసినట్టు తెలియడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. తమకు 95709 52956 నంబర్‌నుంచి కాల్స్ వచ్చాయని, సంభాషణ హిందీలో సాగిదని వారు ఫిర్యాదు చేశారు.

వీటిని బట్టి డబ్బు కాజేసింది బీహార్ వాసి అని పోలీసులు అనుమానిస్తున్నారు. అపరిచితుల ఫోన్‌కాల్స్‌కు స్పందించి ఎవరూ తమ ఏటీఎం కార్డు వివరాలు చెప్పవద్దని, అటువంటి కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ ఎండీ ఉమర్ విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement