భక్తులకు మెరుగైన సౌకర్యాలు | best fecilities for peoples | Sakshi
Sakshi News home page

భక్తులకు మెరుగైన సౌకర్యాలు

Aug 17 2016 12:15 AM | Updated on Sep 4 2017 9:31 AM

భక్తులకు మెరుగైన సౌకర్యాలు

భక్తులకు మెరుగైన సౌకర్యాలు

కృష్ణ పుష్కరాల్లో పుణ్య స్నానాలు చేసేందుకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ సిహెచ్‌.విజయమోహన్‌ అన్నారు.

కృష్ణ పుష్కరాల్లో పుణ్య స్నానాలు చేసేందుకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ సిహెచ్‌.విజయమోహన్‌ అన్నారు. మంగళవారం లింగాలగట్టులోని పుష్కరఘాట్లను జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏర్పాట్ల విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదన్నారు. లింగాలగట్టు లోలెవల్‌ ఘాటులో భక్తుల కోసం మధ్యాహ్నా భోజన వసతి కల్పిస్తున్నామన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ స్వయంగా శిబిరంలో పుష్కర భక్తులకు భోజనాన్ని వడ్డించారు. శ్రీశైలం డ్యామ్‌ నుంచి విద్యుత్‌ ఉత్పత్తి అనంతరం విడుదలవుతున్న నీటిని నిలుపుదల చేయించి లింగాలఘాటు దిగువఘాటును సోమవారం అర్ధరాత్రి కలెక్టర్‌ దగ్గరుండి సిబ్బంది చేత శుభ్రం చేయించారు.  
– శ్రీశైలం 
 

Advertisement
 
Advertisement
Advertisement