ప్రమాదాలకు చోటివ్వొద్దు | be alert at pushkaras | Sakshi
Sakshi News home page

ప్రమాదాలకు చోటివ్వొద్దు

Jul 31 2016 12:12 AM | Updated on Apr 3 2019 7:53 PM

పుష్కరాల సందర్భంగా స్నానఘట్టాల వద్ద బందోబస్తు విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ నీటిమునక ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని అడిషనల్‌ ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు.

– అడిషనల్‌ ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి
 
కర్నూలు:
 పుష్కరాల సందర్భంగా స్నానఘట్టాల వద్ద బందోబస్తు విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ నీటిమునక ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని అడిషనల్‌ ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. లింగాలగట్టు, సంగమేశ్వరం, నెహ్రూ నగర్‌ ఘాట్లలో విధులకు నియమించిన పోలీసు సిబ్బందికి శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో శిక్షణా తరగతులు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా కానిస్టేబుల్‌ స్థాయినుంచి ఇన్‌స్పెక్టర్‌ స్థాయి వరకు మొత్తం వంద మంది సిబ్బంది హాజరయ్యారు. అడిషనల్‌ ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, పోలీసు శిక్షణాకేంద్రం వైస్‌ ప్రిన్సిపల్‌ రాజశేఖర్‌రాజు, హోంగార్డ్స్‌ డీఎస్పీ కష్ణమోహన్‌ తదితరులు కార్యక్రమానికి హాజరై పుష్కర ఘాట్ల వద్ద పోలీసు సిబ్బంది నిర్వర్తించాల్సిన విధుల పట్ల పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీటీసీ వైస్‌ ప్రిన్సిపల్‌ రాజశేఖర్‌రాజు మాట్లాడుతూ వర్షాకాలాన్ని దష్టిలో పెట్టుకుని రెయిన్‌కోట్స్, టార్చ్‌లైట్లు, జంగిల్‌ షూస్, వాటర్‌బాటిళ్లు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని సూచించారు. పుష్కరాలకు తరలివచ్చే భక్తులతో  మర్యాదగా, సేవా దక్పథంతో ప్రవర్తించాలని సూచించారు. ఘాట్ల రద్దీని ఎప్పటికప్పుడు మ్యాన్‌ప్యాక్‌ ద్వారా స్నానాలు జరిగే సందర్భాల్లో క్రమ పద్ధతిలో అనుమతిస్తూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పైఅధికారులకు చేరవేయాలని సూచించారు. తొక్కిసలాటకు తావు లేకుండ అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. గత ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకుని నీటిమునక ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇన్‌స్పెక్టర్లు శ్రీనాథరెడ్డి, దివాకర్‌రెడ్డి, దైవప్రసాద్, శ్రీనివాసమూర్తి, ప్రసాద్, రామయ్య నాయుడు, పూలరామకష్ణ తదితరులు శిక్షణా తరగతులకు హాజరయ్యారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement