బాస్కెట్‌బాల్‌ పోటీలు ప్రారంభం | basket ball games start | Sakshi
Sakshi News home page

బాస్కెట్‌బాల్‌ పోటీలు ప్రారంభం

Aug 27 2016 9:04 PM | Updated on Sep 4 2017 11:10 AM

బాస్కెట్‌బాల్‌ పోటీలు ప్రారంభం

బాస్కెట్‌బాల్‌ పోటీలు ప్రారంభం

మార్టేరు (పెనుమంట్ర) : మార్టేరులోని వేణుగోపాలస్వామి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శనివారం రాత్రి రాష్ట్రస్థాయి ఇన్విటేన్‌ బాస్కెట్‌బాల్‌ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

మార్టేరు (పెనుమంట్ర) : మార్టేరులోని వేణుగోపాలస్వామి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శనివారం రాత్రి రాష్ట్రస్థాయి ఇన్విటేన్‌ బాస్కెట్‌బాల్‌ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మార్టేరులో క్రీడలకు సూర్తి ప్రదాతగా నిలిచిన పడాల ప్రహ్లాదరెడ్డి మెమోరియల్‌ తరఫున పోటీలు నిర్వహిస్తున్నారు. మూడు రోజులపాటు పోటీలు నిర్వహిస్తారు. పోటీల ప్రారంభోత్సవానికి  పారిశ్రామికవేత్త గొలుగూరి శ్రీరామారెడి,్డ వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కవురు శ్రీనివాసు తదితరులు హాజరయ్యారు. ముందుగా అతిథులు బాస్కెట్‌బాల్‌ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. మార్టేరు,ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం నుంచి జట్లు వచ్చాయి. పోటీల ప్రారంభ సమయానికి వర్షం కురవడంతో నిర్వాహకులు ఆదివారానికి వాయిదా వేశారు. దీంతో మొదటిరోజు ప్రారంభ సభ మాత్రమే జరిగింది. అంతర్జాతీయ బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుడు సత్తి సుబ్బన్‌రెడ్డి, పీడీ భూపతిరాజు వెంకట నరసింహరాజు, గొలుగూరి శ్రీనివాసరెడ్డి, తాడి శ్రీనివాసరెడ్డి, కష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  
 
 
 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement