ఏటీఎం దొంగ అరెస్టు | ATM thief arrested | Sakshi
Sakshi News home page

ఏటీఎం దొంగ అరెస్టు

May 26 2016 12:13 PM | Updated on Sep 4 2017 12:59 AM

ఆంధ్రాబ్యాంకు ఏటీఎం వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న ఓ వ్యక్తి రూ.లక్ష మేర కాజేసి, పోలీసులకు దొరికిపోయాడు.

ఆంధ్రాబ్యాంకు ఏటీఎం వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న ఓ వ్యక్తి రూ.లక్ష మేర కాజేసి, పోలీసులకు దొరికిపోయాడు. వరంగల్ జిల్లా గణపురం మండలం గాంధీనగర్‌కు చెందిన బాణాల ప్రశాంత్ విలాసాల కోసం వినూత్న పద్ధతిని ఎంచుకున్నాడు. ఆంధ్రా బ్యాంకు ఏటీఎం సెంటర్‌లే టార్గెట్ చేసుకున్నాడు.

డెబిట్ కార్డును వాడుకుని ట్రాన్సాక్షన్ పూర్తి అయినట్లు చూపకుండానే హడావుడిగా వెళ్లిపోయే వినియోగదారులను ప్రశాంత్ గుర్తించేవాడు. ఆ వెంటనే ఏటీఎం సెంటర్‌లోకి వెళ్లి.. వారి ట్రాన్సాక్షన్‌ను కొనసాగించి డబ్బులు డ్రా చేసుకునేవాడు. ఇలా పలువురి ఖాతాల నుంచి రూ.90 వేల వరకు డ్రా చేసుకున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నిఘా పెట్టిన పోలీసులు ఇతడిని పట్టుకున్నారు. ఇతని నుంచి రూ.80 వేలను రికవరీ చేసి, గురువారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement