అదనపు ఎస్పీ చంద్రశేఖర్‌ బదిలీ


ఏలూరు అర్బ¯ŒS : జిల్లా అడిషనల్‌ ఎస్పీ ఎ¯ŒS.చంద్రశేఖర్‌ను ఏసీబీ అడిషనల్‌ ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఓఎస్డీగా బాధ్యతలు నిర్వహిస్తున్న వి.రత్నను జిల్లా అడిషనల్‌ ఎస్పీగా నియమిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్‌ 2013 నవంబర్‌ 22న హైదరాబాద్‌ నుంచి జిల్లాకు వచ్చారు. నాటి నుంచి ఆయన బాధ్యతల నిర్వహణలో చురుగ్గా వ్యవహరించడంతో పాటు పలు కేసుల్లో చాకచక్యంగా నిందితులను గుర్తించడం, కేసులను ఛేదించడంలో ప్రముఖంగా వ్యవహరించారు. అదే సమయంలో చాలా సౌమ్యునిగా మంచిపేరు సంపాదించుకున్నారు. 

 
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top