పీఓఎస్‌ యంత్రాలకు దరఖాస్తు చేసుకోండి | apply to pos machines | Sakshi
Sakshi News home page

పీఓఎస్‌ యంత్రాలకు దరఖాస్తు చేసుకోండి

Nov 20 2016 11:09 PM | Updated on Sep 4 2017 8:38 PM

పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ (పీఓఎస్‌) స్వైప్‌ యంత్రాల కోసం డీలర్లు, వర్తకులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం ఓ ప్రకటనలో సూచించారు.

అనంతపురం అర్బన్‌  : పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ (పీఓఎస్‌) స్వైప్‌ యంత్రాల కోసం డీలర్లు, వర్తకులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం  ఓ ప్రకటనలో సూచించారు. దరఖాస్తులను ఆర్‌డీఓ, మున్సిపల్‌ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో స్వీకరిస్తారన్నారు. జిల్లాలోని చౌక దుకాణాల డీలర్లు, గ్యాస్‌ ఏజెన్సీలు, పెట్రోల్‌ బంకులు యజమానులు ఇలా అన్ని రకాల వర్తకులు, వ్యాపారులు తప్పని సరిగా పీఓఎస్‌ యంత్రాల ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలన్నారు. ఇందులో ఎలాంటి జాప్యానికి తావివ్వకుండా యంత్రాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement