జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో ఐటీఐలో 2వ విడత ప్రవేశానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కన్వీనర్ వేమారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులకు ఈనెల 11 నుంచి 20వ తేదీలోపు దరకాస్తు చేసుకోవాలని సూచించారు.
ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
Aug 9 2016 11:29 PM | Updated on Sep 4 2017 8:34 AM
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో ఐటీఐలో 2వ విడత ప్రవేశానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కన్వీనర్ వేమారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులకు ఈనెల 11 నుంచి 20వ తేదీలోపు దరకాస్తు చేసుకోవాలని సూచించారు. ఏ కళాశాలలో అభ్యర్థులు ప్రవేశం పొందాలనుకుంటున్నారో ఆ కళాశాలలో మాత్రమే దరఖాస్తులు సమర్పించాలని కోరారు. అన్ని ప్రభుత్వ ఐటిఐలలో ఈనెల 24న కౌన్సిలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. ప్రైవేటు ఐటిఐలలో ప్రవేశం కోసం ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు సంబంధిత ఐటీఐలలో జరుగుతుందని పేర్కొన్నారు.
Advertisement
Advertisement