ప్రత్యేక హోదా కల్పించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసం చేస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఏపీసీసీ) ఆరోపణలు చేసింది.
విజయవాడ: ప్రత్యేక హోదా కల్పించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసం చేస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఏపీసీసీ) ఆరోపణలు చేసింది.
ఈ విషయంలో సదరు నేతలపై సోమవారం ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసే కార్యక్రమంలో భాగంగా పీసీసీ ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రూ, అవినాష్, కడియాల బుచ్చిబాబు మాచవరం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఇక నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గవర్నర్ పేటలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు