జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో పురాతన రాతి నంది విగ్రహం చోరీకి గురైంది.
పురాతన నంది విగ్రహం చోరీ
Jul 22 2016 2:05 AM | Updated on Sep 4 2017 5:41 AM
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో పురాతన రాతి నంది విగ్రహం చోరీకి గురైంది. గురువారం వేకువజామున ఆలయ ప్రధానార్చకులు కాళ్లకూరి రవికుమారశర్మ ఆలయం వద్దకు రాగా అప్పటికే తలుపులు తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఆయన ఆలయంలోకి వెళ్లి చూడగా నంది విగ్రహం కనిపించకపోవడంతో విషయాన్ని గ్రామస్తులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. నంది విగ్రహాన్ని దుండగులు పెకిలించి ఎత్తుకుపోయారు. విగ్రహం దాదాపు 500 ఏళ్ల క్రితం రెడ్డిరాజుల కాలం నాటిదని అర్చకులు అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఎ.ఆనందరెడ్డి తెలిపారు.
Advertisement


