మూడు రోజుల విరామం అనంతరం రత్నగిరి మళ్లీ భక్తజనసంద్రంగా మారింది. సత్యదేవుని దర్శించేందు కు శనివారం సుమారు 40 వేల మంది భక్తులు తరలి రావడంతో రత్నగిరి కిక్కిరిసిపోయింది. స్వామివారిని దర్శిం చేందుకు భక్తులు ఉదయం నుంచీ క్యూ కట్టారు.
-
సత్యదేవుని దర్శించిన 40 వేలమంది
-
రూ.40 లక్షల ఆదాయం
అన్నవరం :
మూడు రోజుల విరామం అనంతరం రత్నగిరి మళ్లీ భక్తజనసంద్రంగా మారింది. సత్యదేవుని దర్శించేందు కు శనివారం సుమారు 40 వేల మంది భక్తులు తరలి రావడంతో రత్నగిరి కిక్కిరిసిపోయింది. స్వామివారిని దర్శిం చేందుకు భక్తులు ఉదయం నుంచీ క్యూ కట్టారు. వ్రతమండపాలు చాలకపోవడంతో స్వామివారి నిత్య కల్యాణ మం డపంలో ఉదయం ఏడు నుంచి పది గంటల వరకూ వ్రతా లు నిర్వహించారు. ఒక దశలో వ్రతాలాచరించే భక్తులు పెరగడంతో క్యూ కల్యాణ మండపం నుంచి రావిచెట్టు వరకూ పెరిగిపోయింది. సాయంత్రం 5 గంటల సమయానికి 4,710 వ్రతాలు జరిగాయి. వ్రతాలాచరించిన భక్తులు స్వామివారిని దర్శించి, గోకులంలో సప్తగో ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. సుమారు 5 వేలమంది భక్తులకు పులిహోర, దద్ధోజనం ఉచితంగా పంపిణీ చేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. ఆదివారం సెలవు కూడా కావడంతో సుమారు 50 వేలమంది భక్తులు స్వామి సన్నిధికి వస్తారని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ మేరకు తెల్లవారుజాము నుంచీ వ్రతాల నిర్వహణ, దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.