అందని సర్టిఫికెట్లు..తప్పని ఇక్కట్లు | andni certificatlu.. thappani ikkatlu | Sakshi
Sakshi News home page

అందని సర్టిఫికెట్లు..తప్పని ఇక్కట్లు

Oct 1 2016 11:53 PM | Updated on Sep 4 2017 3:48 PM

ఐటీఐ కళాశాలలో 2014–15 విద్య సంవత్సరానికి సంబంధించి ఐటీఐ డీజిల్‌ కోర్సు పాసైన విద్యార్థులు సర్టిఫికెట్లు రాక అవస్థలు పడుతున్నారు. అధికారులు చేసిన తప్పిదం వల్ల ఎర్రగుంట్ల ఐటీఐ కళాశాలకు రావాల్సిన సర్టిఫికెట్లు చిత్తూరు జిల్లాలోని విజయపురి కళాశాలకు వెళ్లాయి.

ఎర్రగుంట్ల: ఐటీఐ కళాశాలలో 2014–15 విద్య సంవత్సరానికి సంబంధించి ఐటీఐ డీజిల్‌ కోర్సు పాసైన విద్యార్థులు సర్టిఫికెట్లు రాక అవస్థలు పడుతున్నారు. అధికారులు చేసిన తప్పిదం వల్ల ఎర్రగుంట్ల ఐటీఐ కళాశాలకు రావాల్సిన సర్టిఫికెట్లు చిత్తూరు జిల్లాలోని విజయపురి కళాశాలకు వెళ్లాయి. ఎర్రగుంట్ల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ ఏడాది జనవరిలో డీజిల్‌ కోర్సు పరీక్షలు నిర్వహించారు. ఇందులో 15 మంది ఉత్తీర్ణత సాధించారు.  ఇంత వరకు సర్టిఫికెట్లు రాకపోవడంతో విద్యార్థులు ఏ కంపెనీ లో ఉద్యోగంలో చేరలేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఆరా తీస్తే  ప్రభుత్వ అధికారులు ఆన్‌లైన్‌లో ఎర్రగుంట్లకు చెందిన సర్టిఫికెట్లపై చిత్తూరు జిల్లాలోని విజయపురి అని పెట్టడడం వల్ల అక్కడికి పోయాయి.ఈ విషయం ఏవరికి తెలియదు. అయితే కళాశాలకు సీ ఫాం రావడం వల్ల సర్టిఫికెట్లు విజయపురికి పోయినట్లు గుర్తించారు. వెంటనే స్థానిక ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్‌ విషయాన్ని  బోర్డు ఉన్నతాధికారులకు తెలియజేశారు. అధికారులు చేసిన తప్పిదం బయటకు తెలియజేయకుండా ర హస్యంగా ఉంచారు.  త్వరగా వస్తాయంటూ నమ్మిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement