ప్రతి జిల్లాలోను కాపు జేఏసీలను నియమిస్తున్నట్టు కాపు సద్భావన సంఘం జిల్లా అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు అన్నారు. ఆదివారం పలువురు కాపు నాయకులతో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్వగృహం వద్ద విలేకరులతో మాట్లాడారు.
కిర్లంపూడి :
ప్రతి జిల్లాలోను కాపు జేఏసీలను నియమిస్తున్నట్టు కాపు సద్భావన సంఘం జిల్లా అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు అన్నారు. ఆదివారం పలువురు కాపు నాయకులతో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్వగృహం వద్ద విలేకరులతో మాట్లాడారు. తొలివిడతగా చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో నియోజకవర్గానికి పది మంది చొప్పున కాపు జేఏసీని ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. రెండో విడతలో ఈ నెల 26న కడప, 27న కర్నూలు, 28న అనంతపురం, 29న కృష్ణా జిల్లాల్లో పర్యటించి, కాపు జేఏసీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరో రెండు విడతల్లో అన్ని జిల్లాల్లో కాపు జేఏసీల ఏర్పాటు పూర్తిచేస్తామని తెలిపారు. భవిష్యత్తులో చేపట్టబోయే ఆందోళనలకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు వేణుగోపాల్, గోపు చంటిబాబు, గౌతు స్వామి, గౌతు సుబ్రహ్మణ్యం, సానా బోసు, చిడిపిరెడ్డి సత్తిబాబు, సూరత్ సత్యన్నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.