అలరించిన ఏకపాత్రాభినయ పోటీలు | alarinchina ekaptrbhinaya potilu | Sakshi
Sakshi News home page

అలరించిన ఏకపాత్రాభినయ పోటీలు

Aug 29 2016 10:49 PM | Updated on Sep 4 2017 11:26 AM

అలరించిన ఏకపాత్రాభినయ పోటీలు

అలరించిన ఏకపాత్రాభినయ పోటీలు

తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్‌ సెంటర్‌) : పట్టణ కళా పరిషత్‌ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి స్థానిక బీవీఆర్‌ కళాకేంద్రంలో పద్మశ్రీ రేలంగి అండ్‌ టీఆర్‌ త్యాగరాజు స్మారక 4వ జాతీయస్థాయి ఏకపాత్రాభినయ పోటీలు నిర్వహించారు.

తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్‌ సెంటర్‌) :  పట్టణ కళా పరిషత్‌ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి స్థానిక బీవీఆర్‌ కళాకేంద్రంలో పద్మశ్రీ రేలంగి అండ్‌ టీఆర్‌ త్యాగరాజు స్మారక 4వ జాతీయస్థాయి ఏకపాత్రాభినయ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విజేతల వివరాలను పరిషత్‌ నిర్వాహకులు, రచయిత, దర్శకుడు కోపల్లె శ్రీనివాస్‌ సోమవారం వెల్లడించారు. పౌరాణిక విభాగంలో మంగిన నాగమణి(తణుకు) చంద్రమతి పాత్రధారిణిగా ప్రథమ బహుమతి సాధించారు. కైల వెంకటేశ్వర్లు (ఒంగోలు) ద్వితీయ బహుమతి, ఎస్‌.ఏ.హమీద్‌ (ఏలూరు) తృతీయ బహుమతి అందుకున్నారు.
 బి.త్రినా«థరాజు, గుంటుపల్లి వీరాంజనేయ చౌదరి, గుండా మురళీకృష్ణ, హనుమంత పెద్ది రాజు కన్సోలేషన్‌ బహుమతులకు ఎంపికయ్యారు. చారిత్రక–సాంఘిక విభాగంలో గిరిజన వెంకటరత్నం (బుట్టయ్యగూడెం కాలనీ) వీరపాండ్య కట్ట బ్రహ్మన పాత్రధారిగా మొదటి బహుమతి సాధించగా, ఇనుమలు వెంకటేశ్వర్లు (పాలకొల్లు), ఆలీ (నరసాపురం) ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించారు. కన్సోలేషన్‌ బహుమతులు పొదిలి నాగేంద్ర ప్రసాద్, నడింపల్లి రాజగోపాలరాజు, కె.లాల్‌ నెహ్రు అందుకున్నారు. విశిష్ట సత్కార గ్రహీత ప్రదర్శన జి.సాంబశివరావు (హైదరాబాద్‌) రారాజు పాత్రధారి అందుకున్నారు. బాల భవిత ప్రదర్శనలో దంపూరి మారుతీ కృష్ణ మనోహర్‌కు ప్రశంస బహుమతి అందించారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా గొర్తి మురళీ కృష్ణ సిద్ధాంతి, రాజా తాతాయ్య, అడ్డగర్లు వెంకటేశ్వర్లు వ్యవహరించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement