దంతులు ఇలా.. సాగు భళా | agriculture methods | Sakshi
Sakshi News home page

దంతులు ఇలా.. సాగు భళా

Jul 23 2017 7:53 PM | Updated on Jun 4 2019 5:04 PM

దంతులు ఇలా.. సాగు భళా - Sakshi

దంతులు ఇలా.. సాగు భళా

ఎద్దులు లేవు..ఎద్దులున్న రైతులను బాడుగకు పిలిస్తే దంతులు పట్టడానికి ఎకరాకు రూ.300 అడుగుతున్నాడు.

బత్తలపల్లి : ఎద్దులు లేవు..ఎద్దులున్న రైతులను బాడుగకు పిలిస్తే దంతులు పట్టడానికి ఎకరాకు రూ.300 అడుగుతున్నాడు..కలుపు తీయడానికి కూలీలకు రూ.100 ఇవ్వాలి. ఇలా అయితే తనకు ఇబ్బంది అని భావించిన ఓ రైతు వినూత్నంగా ఓ ప్రయోగం చేసి సక్సెస్‌ అయ్యాడు. మండలంలోని ఎం.చెర్లోపల్లి గ్రామానికి చెందిన గుమ్మడి నారాయణరెడ్డి తనకున్న 15 ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేశాడు. దంతులు పట్టడానికి ఎద్దులకు రూ.300, కూలీలకు ఒక్కొక్కరికి రూ.200 ఇవ్వాల్సి ఉంది. ఇలా అయితే 15 ఎకరాలకు మూడు రోజులు సమయం పడుతుంది.

దీనివల్ల సమయం వృథాతో పాటు కూలీలు అధికంగా చెల్లించాల్సి వస్తుంది. కేవలం కూలీలతోనే కలుపు తీసే పని చేస్తే నాలుగు రోజులు పడుతుంది. ఇది కూడా ఖర్చుతో కూడుకున్నదే. దీంతో తన ట్రాక్టర్‌కు ఒక పైపును కట్టి ఆ పైపుకు 8 మంది కూలీలతో దంతులు పట్టాడు. 15 ఎకరాలు ఒక రోజులోనే ఐదు లీటర్లతో పూర్తి చేశాడు. కూలీలకు రూ.200 ప్రకారం కూలి డఽబ్బులు చెల్లించాడు. తద్వారా ఎద్దులకు ఇవ్వాల్సిన బాడుగతో పాటు సమయం కలిసోచ్చిందని రైతు అంటున్నాడు. దీంతో ఈ ప్రయోగంకు రైతులు సన్నద్ధమవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement