రిషితేశ్వరి కేసు:నిందితుల బెయిల్ పై నేడు విచారణ | accusing of rishiteswari suicide case bail plea in district court | Sakshi
Sakshi News home page

రిషితేశ్వరి కేసు:నిందితుల బెయిల్ పై నేడు విచారణ

Aug 7 2015 10:36 AM | Updated on Sep 3 2017 6:59 AM

రిషితేశ్వరి కేసు:నిందితుల బెయిల్ పై నేడు విచారణ

రిషితేశ్వరి కేసు:నిందితుల బెయిల్ పై నేడు విచారణ

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థిని ఎం.రుషితేశ్వరి మృతి కేసులో నిందితుల తరపున దాఖలైన బెయిల్ పిటిషన్‌ ను శుక్రవారం జిల్లా కోర్టులో విచారణకు రానుంది.

గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థిని ఎం.రుషితేశ్వరి మృతి కేసులో నిందితుల తరపున దాఖలైన బెయిల్ పిటిషన్‌ ను శుక్రవారం జిల్లా కోర్టులో విచారణకు రానుంది. ఈ కేసులో దుంప హనీషా, జయచరణ్, నరాల శ్రీనివాస్ నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. అంతకుముందు మృతురాలు తండ్రి అయిన మొండి మురళీకృష్ణ  తనను కూడా రికార్డుపరంగా ప్రతివాదిగా తరపున సీనియర్ న్యాయవాది వైకే బుధవారం పిటిషన్ దాఖలు చేయగా అది గురువారం  విచారణకు వచ్చింది.

 

బాధితులు తమకు నచ్చిన న్యాయవాదిని నియమించుకునే హక్కు ఉన్నదని న్యాయమూర్తులు అందుకు అనుమతించాలనే న్యాయసూత్రాన్ని న్యాయవాది వైకే తన వాదన ద్వారా  వినిపించారు.  వైకే వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి గోపీచంద్ బెయిల్ పిటీషన్‌లో 2వ ప్రతివాదిగా మురళీకృష్ణను చేర్చేందుకు అనుమతిస్తూ  ఉత్తర్వులు జారీ చేశారు.  దీంతో పాటు కేసు విచారణను నేటికి వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement