జాగ్రత్తలతో ప్రమాదాల నివారణ | accidents avoid with prevention | Sakshi
Sakshi News home page

జాగ్రత్తలతో ప్రమాదాల నివారణ

Jan 24 2017 9:14 PM | Updated on Apr 3 2019 7:53 PM

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చునని డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ పి.ప్రమీళ పేర్కొన్నారు.

– రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా నగరంలో భారీ ర్యాలీ
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చునని డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ పి.ప్రమీళ పేర్కొన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మంగళవారం నగరంలో  భారీ ర్యాలీ నిర్వహించారు. అవుట్‌ డోర స్డేడియం నుంచి నంద్యాల చెక్‌ పోస్టు వరకు అక్కడి నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..వాహనదారులు కచ్చితంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌  పొందాలని సూచించారు. ద్విచక్రవాహనదారులు  హెల్మెట్‌  ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్టును తప్పక పెట్టుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలను నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాలలు,దేవాలయాల సమీపంలో వాహనానలు నెమ్మదిగా పోయేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌టీఓ జగదీశ్వరాజు, ఎంవీఐ అతికనాథ్, ఏఎంంవీఐ రమణనాయక్, రఘునాథ్‌ పాల్గొన్నారు. 
 
వాహనాల వేలం పాట వాయిదా
బుధవారం నిర్వహించాల్సిన పాత వాహనాల వేలం పాటను వాయిదా వేసినట్లు డీటీసీ పి.ప్రమీళ తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవం, రోడ్డు భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని వాయిదా వేసినట్లు వివరించారు. తిరిగి ఫిబ్రవరి ఒకటో తేదీన వేలం పాట  నిర్వహించనున్నట్లు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement