ముగిసిన శ్రీనివాస్ నాయుడి విచారణ | acb investigation of srinivas naidu in cash for vote case completed | Sakshi
Sakshi News home page

ముగిసిన శ్రీనివాస్ నాయుడి విచారణ

Aug 18 2015 5:26 PM | Updated on Aug 17 2018 12:56 PM

టుకు కోట్లు కేసులో మాజీ ఎంపీ డీకే ఆదికేశవుల నాయుడు కుమారుడు శ్రీనివాస్ నాయుడ్ని మంగళవారం ఏసీబీ విచారించింది.

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో మాజీ ఎంపీ డీకే ఆదికేశవుల నాయుడు కుమారుడు శ్రీనివాస్ నాయుడ్ని మంగళవారం ఏసీబీ విచారించింది. ఆరు గంటలపాటు శ్రీనివాస్ నాయుడ్ని ఏసీబీ అధికారులు విచారించారు. ఏసీబీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు విచారణ ముగిసిన అనంతరం శ్రీనివాస్ నాయుడు మీడియాకు తెలిపాడు.

 

శ్రీనివాస్ నాయుడి విచారణలో భాగంగా ఈరోజు బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి హాజరయ్యారు. ఓటుకు కోట్లు కేసులో 160సీఆర్సీసీ కింద సోమవారం శ్రీనివాస్ నాయుడుకు  తెలంగాణ ఏసీబీ నోటీసులు ఇచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement