కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి పట్టణంలోని కొత్తపేటలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న వెంకట్రామిరెడ్డి(42) చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో సతమతమవుతూ ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.