ఆ విమానంలో 9మంది విశాఖవాసులు | 9 vishakapatnam citizens in missing AN-32 flight | Sakshi
Sakshi News home page

ఆ విమానంలో 9మంది విశాఖవాసులు

Jul 22 2016 6:36 PM | Updated on Sep 4 2017 5:51 AM

ఆ విమానంలో 9మంది విశాఖవాసులు

ఆ విమానంలో 9మంది విశాఖవాసులు

అదృశ్యమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్-32 విమానంలో 9 మంది విశాఖపట్నం వాసులు ఉన్నారు.

విశాఖపట్నం: అదృశ్యమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్-32 విమానంలో 9 మంది విశాఖపట్నం వాసులు ఉన్నారు. గల్లంతయిన వారిలో 8 మంది ఎన్ఏడీ సివిల్ ఉద్యోగులు, ఒక ఛార్జ్మన్ ఉన్నారు. ఫిట్టర్లు ప్రసాద్ బాబు, నాగేంద్రరావు, చిన్నారావు, శ్రీనివాసరావు, సేనాపతి, మహారాణా, చిట్టిబాబు, ఛార్జ్మన్ సాంబమూర్తి గల్లంతయ్యారు. బాధిత కుటుంబాలకు అధికారులు సమాచారం అందించారు. గంటలు గడుస్తున్నా విమానం ఆచూకీ తెలియకపోవడంతో గల్లంతయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

శుక్రవారం ఉదయం తమిళనాడులోని తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళుతున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం గల్లంతయింది. విమానంలో మొత్తం 29 మంది ఉన్నట్టు సమాచారం. ఈ రోజు సాయంత్రం వరకు విమానం ఆచూకీ తెలియరాలేదు. ఏఎన్-32 విమానం ఆచూకీ కనుగొనేందుకు గాలింపు చర్యలను ముమ్మురం చేశారు. బంగాళాఖాతంలో భారత వాయుసేన, నౌకాదళం సిబ్బంది విస్తృతంగా గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement